: ఎమ్మెల్యేలను బంధించి ఓటింగ్ జరుపుతున్నారు: పన్నీర్ సెల్వం ఆగ్రహం
తమిళనాడు సీఎం పళనిస్వామి ఆ రాష్ట్ర అసెంబ్లీలో బల నిరూపణ పరీక్ష ఎదుర్కుంటున్న నేపథ్యంలో జరుగుతున్న పరిస్థితులపై పన్నీర్ సెల్వం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలను బంధించి ఓటింగ్ జరుపుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. రహస్య ఓటింగ్ జరపాలని తమతో పాటు డీఎంకే, కాంగ్రెస్, ముస్లింలీగ్ పట్టుబడుతున్నప్పటికీ అందుకు ఒప్పుకోకుండా సభను ముందుకు తీసుకెళుతున్న తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా సభ నడుస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే మూడు బ్లాక్ ల ఓటింగ్ ముగిసినప్పటికీ రహస్య ఓటింగ్ నిర్వహించాల్సిందేనని ఆయన సభ వాయిదా పడకముందు తన డిమాండ్ ను వినిపించారు.