: ఇక సభలో ఏం జరుగుతుందో తెలియదు.. మీడియా రూంలో ఉన్న ఆడియో స్పీకర్ సైతం కట్!
తమిళనాడు సీఎం పళనిస్వామి ఆ రాష్ట్ర అసెంబ్లీలో బల నిరూపణ పరీక్ష ఎదుర్కుంటున్న సమయంలో ఆయనకు వ్యతిరేకంగా ఉన్న పన్నీర్ సెల్వం, డీఎంకే ఎమ్మెల్యేలు సభలో బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే, ఇంతవరకు సభలో ఏం జరుగుతోందన్న విషయాన్ని మీడియా మిత్రులు తమ రూంలో ఉంచిన స్పీకర్ ద్వారా వింటున్నారు. ప్రస్తుతం ఆ స్పీకర్‌ను కూడా కట్ చేసేయడంతో ఒంటి గంట తరువాత మళ్లీ ప్రారంభం కానున్న సమావేశంలో ఏం జరుగుతోందో ప్రజలకు తెలియని పరిస్థితి ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆరు బ్లాకుల కౌంటింగ్ ముగిసిన తరువాత ఎవరు గెలిచారనే అంశాన్నే సభ లోపలి నుంచి వచ్చిన వారెవరయినా ప్రకటిస్తేగానీ తెలియని పరిస్థితి నెలకొంది.