: విరిగిన మైకులు, టేబుళ్లు, ఛైర్లు.. స్పీకర్ ఛైర్ ను కూడా కదిలించారు.. అసెంబ్లీలో బీభత్స కాండ


తమిళనాడు అసెంబ్లీని స్పీకర్ అరగంట పాటు వాయిదా వేశారు. ప్రత్యక్ష ప్రసారాలు లేకపోవడం, మీడియాను కూడా అనుమతించపోవడంతో... అసెంబ్లీని ఎందుకు వాయిదా వేశారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. అయితే, సభ వాయిదా పడటానికి కారణమేంటో బయటకు పొక్కింది. బల నిరూపణకు 15 రోజుల సమయమున్నా... ఇంత తొందరగా ఎందుకు బల పరీక్షను నిర్వహిస్తున్నారంటూ డీఎంకే విరుచుకుపడింది. డీఎంకే ఎమ్మెల్యేల దెబ్బకు సభలోని మైకులు విరిగాయి. సభలోని టేబుళ్లు, ఛైర్లపైకి డీఎంకే సభ్యులు ఎక్కారు. టేబుళ్లను విరగ్గొట్టే ప్రయత్నం చేశారు. పేపర్లను చింపేశారు. అంతేకాదు, ఏకంగా స్పీకర్ ఛైర్ నే కదిలించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో సభను నిర్వహించడం కష్టంగా మారడంతో సభను స్పీకర్ వాయిదా వేశారు.

  • Loading...

More Telugu News