: ఊహించని ట్విస్ట్... అరగంట పాటు సభను వాయిదా వేసిన తమిళనాడు స్పీకర్
తమిళనాడు అసెంబ్లీలో తీవ్ర గందరగోళం నెలకొన్న నేపథ్యంలో, సభను స్పీకర్ వాయిదా వేశారు. ఓటింగ్ జరుగుతున్న సమయంలో సభ వాయిదా పడినట్టు సమాచారం బయటకు రావడంతో, తీవ్ర ఉత్కంఠ నెలకొంది, ఏ కారణంతో సభను స్పీకర్ వాయిదా వేశారు? సభలో ఏం జరిగింది? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. డివిజన్ టైమ్ లో సభను వాయిదా వేయడంతో హై టెన్షన్ నెలకొంది.
డీఎంకే, కాంగ్రెస్, పన్నీర్ సెల్వం వర్గీయులతో కలిపి అసెంబ్లీలో దాదాపు 120 మంది ఎమ్మెల్యేలు విపక్షంలో ఉన్నారు. ఇంత మంది సభను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో, సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. స్పీకర్ వెల్ లోకి వెళ్లే ప్రయత్నం కూడా విపక్ష సభ్యలు చేసినట్టు తెలుస్తోంది. పరిస్థితి అదుపుతప్పిన క్రమంలోనే అరగంట పాటు సభను వాయిదా వేసినట్టు తెలుస్తోంది. సభ వాయిదా పడినప్పటికీ, ఎమ్మెల్యేలు ఎవరూ బయటకు రాలేదు.