: అసెంబ్లీలోకి భారీ సంఖ్యలో వెళ్లిన మార్షల్స్... స్టాలిన్ సహా విపక్ష సభ్యులందరినీ బయటకు మోసుకుపోయే పరిస్థితి!
పళనిస్వామి విశ్వాసపరీక్ష నేపథ్యంలో, తమిళనాడు అసెంబ్లీలో తీవ్ర గందరగోళం నెలకొంది. రహస్య ఓటింగ్ కోసం, సభను వాయిదా వేయడం కోసం డీఎంకే నేత స్టాలిన్ పట్టుబడుతున్నారు. డీఎంకే ఎమ్మెల్యేలంతా సభను వాయిదా వేయాలంటూ నినాదాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, కాసేపటి క్రితం భారీ సంఖ్యలో మార్షల్స్ అసెంబ్లీలోకి వెళ్లారు. సభలో గందరగోళం సృష్టిస్తున్నారన్న కారణంగా విపక్ష నేతలందరినీ సభ నుంచి స్పీకర్ సస్పెండ్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో, స్టాలిన్, పన్నీర్ సెల్వంలతో పాటు విపక్ష సభ్యులందరినీ మార్షల్స్ ఏ క్షణంలోనైనా బయటకు లాక్కొచ్చే పరిస్థితి నెలకొంది. మరోవైపు, సమావేశాల ప్రత్యక్ష ప్రసారాన్ని స్పీకర్ కట్ చేశారు. మీడియాను కూడా లోపలకు అనుమతించలేదు. దీంతో, లోపల ఏం జరుగుతోందో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది.