: ప్రజాభిప్రాయం తెలుసుకున్న తర్వాతే బలపరీక్ష నిర్వహించాలి!: అసెంబ్లీలో పన్నీర్ సెల్వం వాదన
తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ఆ రాష్ట్ర అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన నేపథ్యంలో పన్నీర్ సెల్వం సభలో మాట్లాడుతూ, పలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. శశికళ నటరాజన్ అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను కూవతూరులోని గోల్డెన్ బే రిసార్టులో ఉంచారని అందరికీ తెలుసని అన్నారు. ప్రజాభిప్రాయం తెలుసుకున్న తర్వాతే బలపరీక్ష నిర్వహించాలని వ్యాఖ్యానించారు. రహస్య ఓటింగ్‌కు ఎందుకు అడ్డుచెబుతున్నారని ఆయన ప్రశ్నించారు. మరోవైపు స్పీకర్ మాత్రం మాత్రం గందరగోళాన్ని పట్టించుకోకుండా ఓటింగ్ కొనసాగిస్తున్నారు.