: పీవీ సింధును వాలీబాల్ ప్లేయర్ అన్న ఎమ్మెల్యే!


రాజకీయ నాయకుల తెలివితేటలతో సామాన్యులు షాక్ అవుతున్నారు. మొన్నటికి మొన్న ఎమ్మెల్యే జలీల్ ఖాన్ బీకాంలో మ్యాథ్స్, ఫిజిక్స్ అంటూ చేసిన కామెంట్లు... సంచలనంగా మారాయి. ఇప్పుడు ఆ జాబితాలో ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ చేరారు. ఓ కార్యక్రమాన్ని ప్రారంభించే సందర్భంలో ఆయన మాట్లాడుతూ, అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ తరపున వాలీబాల్ ఆడిన సింధుకు అభినందనలు తెలుపుతున్నానని అన్నారు. ఈ మాట విన్న సింధు చిరునవ్వు నవ్వింది. మన రాజకీయ నాయకులకు రాజకీయాలు మినహా ఇతర అంశాలపై ఎంతటి నాలెడ్జ్ ఉందో ఇలాంటి ఘటనల వల్ల బయటపడుతోంది. 

  • Loading...

More Telugu News