: సాగరికతో కలసి మరోసారి కనిపించిన జహీర్ ఖాన్


టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ యువరాజ్ సింగ్ పెళ్లిలో 'చక్ దే ఇండియా' ఫేమ్ సాగరికతో కలసి భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ కనిపించడం అప్పట్లో చర్చనీయాంశం అయింది. వీరిద్దరూ ప్రేమలో పడ్డారని జనాలు గుసగుసలాడారు. ఆరు నెలలుగా వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారంటూ వార్తలు వినపడ్డాయి. అయితే, ఆ వార్తలను వీరిద్దరూ ఖండించారు. అయితే, సాగరిక నటించిన 'ఇరాదా' సినిమా విడుదల సందర్భంగా ముంబైలో నిన్న ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సాగరికతో కలసి జహీర్ ఖాన్ కూడా హాజరయ్యాడు. దీంతో, ఇద్దరి మధ్య బంధానికి సంబంధించిన వార్తలకు మరింత బలం చేకూరినట్టైంది. ఈ కార్యక్రమానికి యువరాజ్ సింగ్, హాజెల్ కీచ్, ఆశిష్ నెహ్రా, అజిత్ అగార్కర్ లు కాడా హాజరయ్యారు. 

  • Loading...

More Telugu News