: తదుపరి సీఎం రజనీ అంటూ భారీగా వెలసిన పోస్టర్లు


తమిళనాడు తదుపరి ముఖ్యమంత్రి తలైవా రజనీకాంత్ అంటూ చెన్నైలో భారీ ఎత్తున పోస్టర్లు వెలిశాయి. నగరవాసులు ఈ పోస్టర్లను ఎక్కడికక్కడ నిలబడి ఆసక్తిగా చూస్తున్నారు. పోస్టర్లను చూసిన వారు రజనీ రాజకీయాల్లోకి వస్తేనే మంచిది అనుకుంటూ ముందుకు సాగుతున్నారు. మరోవైపు, రజనీ రాజకీయాల్లోకి రావాలంటూ ఆయన అభిమానులు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు. అయితే, రజనీ మాత్రం ఈ విషయంపై ఇంతవరకు నోరు విప్పలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ శూన్యత నెలకొందని... రజనీ రాజకీయాల్లోకి రావడానికి ఇదే సరైన తరుణమని పలువురు అభిప్రాయపడుతున్నారు. 

  • Loading...

More Telugu News