: 35 వాహనాల్లో అసెంబ్లీకి బయల్దేరిన పళనిస్వామి ఎమ్మెల్యేలు
తమిళనాడు రాజకీయాలు ఉత్కంఠభరితంగా మారాయి. రాష్ట్ర వ్యాప్తంగా హై టెన్షన్ నెలకొంది. కాసేపట్లో అసెంబ్లీలో పళనిస్వామి తన బలాన్ని నిరూపించుకోనున్నారు. ఈ నేపథ్యంలో, గోల్డెన్ బే రిసార్ట్ నుంచి పళనిస్వామి వర్గ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి బయలుదేరారు. మొత్తం 35 వాహనాల్లో, అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య వారు బయలుదేరారు. తన వర్గంలోని ఎమ్మెల్యేలను మొత్తం మూడు గ్రూపులుగా విభజించి, ఒక్కో గ్రూపు బాధ్యతను ఒక్కో మంత్రికి అప్పగించారు పళనిస్వామి. అంతేకాదు, వారితో పాటే తాను కూడా బయల్దేరారు. మార్గమధ్యంలో ఎమ్మెల్యేలు జంప్ అయ్యే అవకాశం ఉండటంతో... భారీ భద్రతను ఏర్పాటు చేశారు పళని.