: ఓటింగ్ కు దూరంగా కరుణానిధి!
కాసేపట్లో తమిళనాడు అసెంబ్లీలో బలపరీక్ష జరగనుంది. అన్నాడీఎంకేకు చెందిన ముఖ్యమంత్రి పళనిస్వామి అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోనున్నారు. ఈ నేపథ్యంలో, పళని స్వామికి వ్యతిరేకంగా ఓటు వేయాలని ప్రతిపక్ష డీఎంకే ఇప్పటికే తన ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసింది. అయితే, డీఎంకే అధినేత కరుణానిధి మాత్రం ఈ ఓటింగ్ కు దూరంగా ఉండనున్నట్టు తెలుస్తోంది. అనారోగ్యం కారణంగా కరుణ అసెంబ్లీకి రారని సమాచారం. డీఎంకేకు మొత్తం 89 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కరుణ అసెంబ్లీకి రాకపోతే, వారి బలం 88కి తగ్గుతుంది. ఉదయం 11 గంటలకు తమిళనాడు అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది.