: ఓటుకు నోటు కేసులో త్వరలో చంద్రబాబు అరెస్ట్.. వైసీపీ నేత మర్రి రాజశేఖర్ జోస్యం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు త్వరలోనే అరెస్టవుతారని వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ జోస్యం చెప్పారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అరెస్ట్ తప్పదని అన్నారు. ఆ విషయం తెలిసే ఆయన తెలంగాణలో కాలుపెట్టకుండా విజయవాడకే పరిమితమయ్యారని విమర్శించారు. శుక్రవారం మాచర్లలో జరిగిన వైసీపీ నేత వెన్నా వెంకటరెడ్డి కుమారుడు సుదర్శనరెడ్డి వివాహానికి హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. కేంద్రం అండతో ప్రస్తుతం అరెస్ట్ నుంచి తప్పించుకుంటున్నా అది ఎన్నాళ్లో సాగదని పేర్కొన్నారు. వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేసులకు భయపడే రకం కాదని రాజశేఖర్ అన్నారు. మరోపక్క, పెదబాబు, చినబాబులిద్దరూ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు.