: మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ కార్యాలయంపై దాడి.. పావుగంట పాటు వీరంగం
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కార్యాలయంపై దుండగులు దాడిచేసి వీరంగం సృష్టించారు. తేని జిల్లా బోడియనాయకనూరులోని పన్నీర్ కార్యాలయానికి చేరుకున్న గుర్తు తెలియని 30 మంది దుండగులు కుర్చీలు, పార్టీ బ్యానర్లను ధ్వంసం చేశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న పన్నీర్ మద్దతుదారుడు రాజవేల్‌పై దాడిచేశారు. పావుగంటపాటు బీభత్సం సృష్టించిన అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. అదే సమయంలో పన్నీర్ కార్యాలయానికి సమీపంలో ఉన్న శశికళ మద్దతుదారుడు బాలమురుగన్ ఇంటిపైనా కొందరు రాళ్ల దాడికి పాల్పడ్డారు. దాడితో బయటకు వచ్చిన బాలమురుగన్ పైనా దుండగులు రాళ్లు విసిరారు.