: ఐశ్వర్యారాయ్ కు బీపీ చెక్ చేసిన అభిషేక్ బచ్చన్!


బాలీవుడ్ ప్రముఖ నటుడు అభిషేక్ బచ్చన్ తన భార్య ఐశ్వర్యా రాయ్ బచ్చన్ కు బీపీ చెక్ చేశాడు. ఇందుకు సంబంధించిన ఓ ఫొటో ను అభిషేక్ తన ఇన్ స్టా గ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేశాడు. అయితే, ఈ ఫొటో ఇప్పటిది కాదు. ‘రావణ్’ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు తీసిన ఫొటో ఇది. ఈ సినిమా షూటింగ్ లో భాగంగా ఎక్కువ సేపు నీటిలో తడవాల్సిన సన్నివేశాల్లో ఐష్ పాల్గొంది. దీంతో, ఆమె బీపీ లెవెల్స్ ఎలా ఉన్నాయో అభిషేక్ చెక్ చేశాడు. ఆ సమయంలో తీసిన ఓ ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు. ‘ఫ్లాష్ బ్యాక్  ఫ్రై డే’ క్యాప్షన్ తో ఈ ఫొటోను అభిషేక్ బచ్చన్ పోస్ట్ చేశాడు. 

  • Loading...

More Telugu News