: పళనిస్వామికి వ్యతిరేకంగా ఓటు వేయండి: ఎమ్మెల్యేలకు పన్నీర్ పిలుపు


తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి పళనిస్వామి రేపు అసెంబ్లీలో బలపరీక్ష ఎదుర్కోనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం సీటును ఆశించి నిరాశ చెందిన పన్నీర్ సెల్వం ఓ ప్రకటన చేశారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రేపు పళనిస్వామికి వ్యతిరేకంగా ఓటు వేయాలని పిలుపు నిచ్చారు. కుటుంబ రాజకీయాలను జయలలిత ప్రోత్సహించలేదని, ‘అమ్మ’ త్యాగాలను మర్చిపోవద్దని, ఎమ్మెల్యేలు తమ ఆత్మప్రబోధానుసారం ఓటు వేయాలని పన్నీర్ సెల్వం కోరారు.

  • Loading...

More Telugu News