: ‘పేటీఎం’పై విమర్శలు గుప్పించిన హెచ్ డీఎఫ్ సీ ఎండీ!


ఇ-వ్యాలెట్స్ కు భవిష్యత్తు లేదని, డిజిటల్ వాలెట్, డిజిటల్ వ్యాలెట్ బిజినెస్ మోడల్ లాభదాయకం కాదంటూ హెచ్ డీఎఫ్ సీ ఎండీ ఆదిత్య పూరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ ఈ-వ్యాలెట్ కంపెనీ పేటీఎంపై ఆయన విమర్శలు చేశారు. వేల కోట్ల రూపాయల నష్టంలో ఉన్న ఈ సంస్థ కు.. రూ.500 బిల్లుపై రూ.250 క్యాష్ బ్యాక్ ఆఫర్ ఎలా ఇస్తున్నదో అర్థం కావడం లేదని, భారత్ లో కఠిన నిబంధనల నేపథ్యంలో ఇలాంటి సంస్థలు విజయం సాధించడం సాధ్యం కాని పని అని ఆయన విమర్శించారు. స్వతంత్ర ఈ-వ్యాలెట్ కంపెనీలు నిధుల నిమిత్తం మధ్యవర్తిగా బ్యాంకులపై ఆధారపడి ఉండాల్సిందేనని నాస్కామ్ ఇండియా లీడర్ షిప్ ఫోరంలో పాల్గొన్న ఆయన తేల్చి చెప్పారు.

  • Loading...

More Telugu News