: సంతోషంలో ‘50 అడుగుల వెడల్పు, ఐదు అడుగుల ఎత్తు’ కేకు తయారు చేయించిన లారెన్స్!


ఇటీవ‌లే త‌మిళ‌నాడులో పోరాటం జ‌రిపి జ‌ల్లిక‌ట్టు క్రీడ కోసం ఆ రాష్ట్ర ప్ర‌జ‌లు ప్రత్యేక ఆర్డినెన్సు సంపాదించుకున్న విష‌యం తెలిసిందే. ఆ పోరాటంలో త‌మిళ నటుడు, ద‌ర్శ‌కుడు, కొరియోగ్రాఫ‌ర్‌ రాఘవ లారెన్స్ కూడా పాల్గొన్నారు. ఆర్డినెన్స్ సాధించుకున్న నేప‌థ్యంలో సంతోషంతో ఆయ‌న రేపు 1100 కిలోల కేకు కట్ చేసి ఎంజాయ్ చేయ‌నున్నారు. లారెన్స్‌ ప్రముఖ చెఫ్‌ వినోద్‌తో పాటు స్నేహితుల స‌మ‌క్షంలో అంబత్తూరు ప్రాంతంలోని ఎన్‌ స్టూడియోలో ఈ కార్యక్రమం నిర్వ‌హించ‌నున్నారు.

ఈ కేకును వినోద్ స‌హా మరో 40 మంది చెఫ్‌లు 22 గంటలు ప‌ని చేసి తయారుచేశారు. ఈ కేకు ఓ రికార్డును కూడా బద్దలు కొట్టేసింది. ఇంతకు ముందు ఇటలీలో 1040 కిలోల కేకును త‌యారు చేసి ప్రపంచ రికార్డు సృష్టించారు. ఆ రికార్డును ఇప్పుడు లారెన్స్‌ తయారు చేయించిన ఈ కేకు బ‌ద్ద‌లు కొట్టింది. ఈ కేకు 50 అడుగుల వెడల్పు, ఐదు అడుగుల పొడవు ఉంది.

  • Loading...

More Telugu News