: ముంబైలోనూ ఘనంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌ పుట్టినరోజు వేడుకలు


తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు ఈ రోజు 63వ‌ పుట్టినరోజు వేడుకలను జ‌రుపుకుంటున్న విష‌యం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయ‌న అభిమానులు తెలంగాణ‌లోనే కాకుండా ఆంధ్రప్రదేశ్, మ‌హారాష్ట్రల్లోనూ కేక్ క‌ట్ చేశారు. ఏపీలోని తెనాలిలో కేసీఆర్ అభిమాన సంఘం ఈ రోజు ఉద‌యం సంబ‌రాలు చేసుకున్న విష‌యం విదిత‌మే. మ‌హారాష్ట్ర రాజ‌ధాని ముంబై నగరంలోనూ ఆయ‌న జ‌న్మ‌దిన వేడు‌క‌లను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ జాగృతి మహారాష్ట్రశాఖ అధ్యక్షుడు ఎస్‌.శ్రీనివాస్ సమ‌క్షంలో న‌గ‌రంలోని ప్రభాదేవీలోని ప్రఖ్యాతిగాంచిన సిద్ధివినాయక మందిరంలో కేసీఆర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ప్రత్యేక పూజలు, హోమం చేశారు. సిద్ధి వినాయకుడి గర్భగుడిలో కేసీఆర్‌ చిత్రపటం ఉంచి ఆయన పేరిట అర్చన చేయించిన ఆయ‌న అభిమానులు.. ఆ త‌ర్వాత మందిరం హాల్‌లోనే కేక్‌కట్‌ చేసి స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు.

  • Loading...

More Telugu News