: పాకిస్థాన్ లో 39 మంది ఉగ్రవాదులు హతం
ఉగ్రవాదులను ప్రోత్సహిస్తోన్న పాకిస్థాన్‌లో నిన్న అదే ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ దేశంలోని సింధ్ ప్రావిన్స్ సెహ్వాన్ లో లాల్ షాబాజ్ కలందర్ దర్గాలో నిన్న జరిగిన బాంబు దాడిలో 100 మందికిపైగా మరణించారు. క్షతగాత్రులైన మరో 250 మందికి పలు ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. అయితే, ఈ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆ దేశ భద్రతా బలగాలు దేశవ్యాప్తంగా ఉన్న తీవ్రవాదుల కోసం గాలిస్తున్నారు. ఈ రోజు 39 మంది ఉగ్రవాదులను హతమార్చారు. భద్రతా బలగాలు పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తూ ఉగ్రవాదులను ఏరివేసే పనిలో నిమగ్నమయ్యారు.