: డీఎంకే నిర్ణయంతో 108కి చేరిన పళనిస్వామి వ్యతిరేక ఓట్లు.. తీవ్ర ఉత్కంఠ


తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి రేపు అసెంబ్లీలో బ‌ల నిరూప‌ణ ప‌రీక్ష ఎదుర్కుంటున్న నేప‌థ్యంలో ఆ రాష్ట్ర ప్ర‌తిప‌క్ష పార్టీ త‌మ 89 ఓట్ల‌ను ప‌ళ‌నిస్వామికి వ్య‌తిరేకంగా వేస్తామ‌ని ప్ర‌క‌టించ‌డంతో శ‌శిక‌ళ వ‌ర్గంలో మ‌రోసారి తీవ్ర అల‌జ‌డి రేగుతోంది. ప్ర‌స్తుతం ఆ రాష్ట్ర పార్టీల ఎమ్మెల్యేల సంఖ్య‌ను ప‌రిశీలిస్తే.. అన్నాడీఎంకేలోని ప‌ళ‌నిస్వామి వ‌ర్గంలో 124, ప‌న్నీర్ వర్గంలో 11, డీఎంకే పార్టీలో 89, కాంగ్రెస్ 8, ఇత‌రులు ఒకరు ఉన్నారు. దీంతో ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా 108 ఓట్లు ప‌డ‌నున్నాయి. మ‌రో ప‌ది మంది ఎమ్మెల్యేలు ప‌న్నీర్ వ‌ర్గంలోకి వ‌స్తే ఇక ప‌ళ‌నిస్వామి క‌ష్టాలు ఎదుర్కోవాల్సిందే.

బలపరీక్ష‌లో ప‌ళ‌నిస్వామిని ఓడించాలంటే ప‌న్నీర్‌కి మ‌రో 10 మండి ఎమ్మెల్యేలు మాత్ర‌మే కావాలి. దీంతో ప‌ళ‌నిస్వామి భ‌వితవ్యాన్ని ఆ ప‌ది మంది ఎమ్మెల్యేలు తేల్చ‌నున్నారు. శ‌శిక‌ళ వ‌ర్గంపై ఆగ్ర‌హంతో ఉండి ఇప్ప‌టికీ రిసార్టులోనే ఎవ‌ర‌యినా ఎమ్మెల్యేలు ఉంటే వారు రేపు ప‌ళ‌నిస్వామికి వ్య‌తిరేకంగా ఓటు వేసే అవ‌కాశం ఉంద‌న్న విష‌యం తెలిసిందే. దీంతో త‌మిళ‌నాడు రాజ‌కీయాలు మ‌రోసారి వేడెక్కాయి.

  • Loading...

More Telugu News