: దిమ్మతిరిగిపోయే వాస్తవాలు తెలుసుకున్న అధికారులు.. హైదరాబాద్‌లో కుళ్లిన మాంసంతో బిర్యానీ
హైదరాబాద్ బిర్యానీ గొప్పదనం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మాంసాహార ప్రియులకు హైదరాబాద్ అంటే ముందుగా గుర్తుకొచ్చేది అక్కడ లభించే బిర్యానీయే. నగరానికి వచ్చిన సెలబ్రిటీలు సైతం అక్కడి బిర్యానీ రుచి చూడనిదే కదలరు. అయితే, హైదరాబాద్‌లో బిర్యానీ అందించే హోటళ్లలో తనిఖీలు చేస్తోన్న అధికారులకు షాకింగ్ నిజాలు తెలిశాయి. ఓ గ్రీన్ బావర్చీ రెస్టారెంట్‌పై జీహెచ్ఎంసీ హెల్త్ ఇన్ స్పెక్టర్లు ఆకస్మిక దాడులు నిర్వహించి, అక్కడ పదిరోజులుగా నిల్వ చేసిన మాంసాన్ని గుర్తించారు. ఆ మాంసం కుళ్లిపోయి, వాసన వస్తోంది. ఆ మాంసంతోనే రెస్టారెంట్లో బిర్యానీ తయారు చేసినట్టు గుర్తించామని జీహెచ్‌ఎంసీ అధికారులు మీడియాకు చెప్పారు. అంతేకాదు, అక్కడ తయారు చేసిన బిర్యానీని చూసిన అధికారులు వాంతులు చేసుకున్నట్లు సమాచారం. నగరంలోని పలు బావర్చి హోటళ్లలోనూ తనిఖీ చేసిన అధికారులు అక్కడా అదే పరిస్థితి ఉండడంతో వాటికి నోటీసులు జారీ చేశారు.