: కోహ్లీ గురించి ఒక్క ముక్కలో చెప్పలేమన్న కుంబ్లే
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై కోచ్ కుంబ్లే ప్రశంసల జల్లు కురిపించాడు. కోహ్లీ గురించి ఒక్క ముక్కలో చెప్పడం చాలా కష్టమని తెలిపాడు. అండర్-19 వరల్డ్ కప్ ను కెప్టెన్ గా గెలిచిన తర్వాత... బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టులోకి వచ్చినప్పటి నుంచి కోహ్లీ తనకు బాగా తెలుసని చెప్పాడు. ఆట పట్ల కోహ్లీకి ఉన్న నిబద్ధత చాలా గొప్పదని... అలాంటి ఆటగాళ్లు ఇతరులకు స్పూర్తి దాయకంగా ఉంటారని అన్నాడు.
ఇదే సమయంలో కోచ్ గా తాను ఎదుర్కొంటున్న అతి కష్టమైన పని ఒక్కటుందని కుంబ్లే తెలిపాడు. జట్టులోకి నీవు సెలెక్ట్ కాలేదని ఒక ఆటగాడికి చెప్పడం అత్యంత కష్టమైన పని అని చెప్పాడు. ఎంత ఇబ్బందికరమైనప్పటికీ, కొన్ని నిర్ణయాలను తీసుకోవాల్సిందే అని అన్నాడు.