: మాట వినకపోతే అనర్హత వేటు వేస్తాం.. జాగ్రత్త: ‘రిసార్టు’ ఎమ్మెల్యేలతో తంబిదురై
తమిళనాడు సీఎం పళనిస్వామి రేపు అసెంబ్లీలో బల నిరూపణ పరీక్ష ఎదుర్కుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమకు చిక్కులు కొని తెచ్చేలా ప్రవర్తిస్తోన్న రిసార్టులో ఉన్న ఎమ్మెల్యేలకు ఆ పార్టీ సీనియర్ నేత, లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై హెచ్చరికలు చేశారట. తమకు తలనొప్పి తెచ్చేలా ప్రవర్తిస్తే అనర్హత వేటు వేస్తామని ఆయన హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. అసెంబ్లీ స్పీకర్ తమ వైపే ఉన్నారని, తమకు వ్యతిరేకంగా ఓటు వేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పినట్లు తెలుస్తోంది. అన్నాడీఎంకే పార్టీ ఎమ్మెల్యేలకు ఈ రోజు జారీ చేసిన విప్‌లో సీఎం పళనిస్వామికి అనుకూలంగా ఓటు వేసి తీరాలని ఆదేశించారు.