: మేం నిర్వహించే నిరుద్యోగ ర్యాలీలో కాల్పులు జరిపేందుకు కొందరు సిద్ధంగా వున్నారు!: కోదండరామ్
ఈ నెల 22న తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న నిరుద్యోగ ర్యాలీని శాంతియుతంగా చేపడతామని ప్రొఫెసర్ కోదండరామ్ తెలిపారు. అయితే జేఏసీని బద్నాం చేసేందుకు కొందరు యత్నిస్తున్నారని... గొడవలు చేసేందుకు, కాల్పులు జరిపేందుకు సిద్ధగా ఉన్నారని, దీనికి సంబంధించిన సమాచారం తమ వద్ద ఉందని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో అనవసరంగా ఎవరూ ఆవేశపడొద్దని, శాంతియుతంగా ర్యాలీ కొనసాగేలా సహకరించాలని కోరారు.
ఒకవేళ రాజకీయ పార్టీ పెట్టే సందర్భం వస్తే, తప్పకుండా పెడతామని కోదండరామ్ తెలిపారు. విలువలతో కూడిన రాజకీయాలు చేసే పార్టీల అవసరం ఉందని... రాజకీయ విలువల కోసం జేఏసీ పోరాడుతుందని ఆయన చెప్పారు. రాజకీయ పార్టీని ఏర్పాటు చేసినా... జేఏసీ మాత్రం కొనసాగుతుందని తెలిపారు.