: ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసిన అన్నాడీఎంకే!


త‌మిళ‌నాడు అధికార పార్టీ అన్నాడీఎంకేలో ఏర్ప‌డిన సంక్షోభం నేప‌థ్యంలో త‌లెత్తిన హై డ్రామా కొన‌సాగుతోంది. ప‌ళ‌నిస్వామిపై ఆగ్ర‌హంతో ఉన్న ఎమ్మెల్యే న‌ట‌రాజ‌న్ ఈ రోజు ప‌న్నీర్ వైపు వ‌చ్చేసిన విష‌యం తెలిసిందే. మరోవైపు రేపు అసెంబ్లీలో బ‌ల నిరూప‌ణ చేసుకోవాల్సి ఉన్న తరుణంలో సీఎం పళనిస్వామి వ‌ర్గంలో ఆందోళ‌న మొద‌లైంది. ఈ నేప‌థ్యంలో అన్నాడీఎంకే నేత‌ల‌కు ఆ పార్టీ ఈ రోజు విప్ జారీ చేసింది. రేపు బ‌ల‌నిరూప‌ణకు అంద‌రూ హాజ‌రుకావాల‌ని ఆదేశించింది. బ‌ల‌నిరూప‌ణ కోసం లీడ‌ర్ ఆఫ్ ది హౌస్‌గా సెంగొట్ట‌య్య‌న్ నియ‌మితుల‌య్యారు. మ‌రోవైపు తమదే అసలైన అన్నాడీఎంకే అని ప‌న్నీర్ సెల్వం వ‌ర్గం వాదిస్తోంది.

  • Loading...

More Telugu News