: అదుపుతప్పి కళాశాలలోకి దూసుకెళ్లిన లారీ
వేగంగా వెళుతున్న ఓ లారీ కళాశాలలోకి దూసుకెళ్లి బీభత్సం సృష్టించిన ఘటన వరంగల్ అర్బన్ హన్మకొండలోని హంటర్ రోడ్లో చోటు చేసుకుంది. ఈ రోజు ఉదయం ఆ రోడ్డు పక్కనే ఉన్న కాకతీయ ఫిజియోథెరపీ కళాశాలలోకి ఆ లారీ దూసుకెళ్లడంతో ఆ కాలేజీ మెయిన్ గేట్ పక్కనే ఉన్న వాచ్‌మెన్ గది పూర్తిగా ధ్వంసం అయింది. దీంతో అందులో ఉన్న వాచ్‌మెన్ సహా అతని భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు గాయాలపాలయిన వారిని దగ్గరలోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం అందాల్సి ఉంది.