: పెను ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి


నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ రోజు త్రుటిలో పెను ప్రమాదం నుంచి బ‌య‌ట‌పడ్డారు. న‌ల్ల‌గొండ జిల్లా కొత్తగూడం ర‌హ‌దారి గుండా ప్ర‌యాణిస్తోన్న ఆయ‌న కారును వేగంగా వ‌చ్చిన ఓ ట్రాక్ట‌ర్ ఢీ కొంది. దీంతో ఆయ‌న ప్ర‌యాణిస్తోన్న కారు ముందు భాగం దెబ్బతిని అక్క‌డే నిలిచిపోయింది. అదృష్ట‌వ‌శాత్తూ కారులో ఉన్న వారికి ఎటువంటి గాయ‌లూ కాలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంత‌రం ఆయ‌న అక్క‌డి నుంచి మ‌రో కారులో వెళ్లిపోయిన‌ట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ సదరు ఎమ్మెల్యే కారుకు ఎదురుగా రావడంతో ఈ ఘటన చోటు చేసుకుందని స్థానికులు తెలిపారు.  

  • Loading...

More Telugu News