: ఆ గానానికి మైమరపు... మ‌రోసారి వేదిక‌పైకి వర్షంలా వచ్చిపడ్డ క‌రెన్సీ నోట్లు!


ఆ గాయ‌కుడు వినిపిస్తోన్న సంగీతానికి మంత్ర‌ముగ్ధులయ్యారు. సంగీత‌ సాగ‌రంలో మునిగితేలారు. ఆ గాయ‌కుడు పాడుతున్న పాట‌ల‌కు అంబ‌రాన్నంటే సంతోషాన్ని వ్య‌క్తం చేశారు. ఇంకేముంది ఆయన ఉన్న వేదిక‌పైకి క‌రెన్సీ నోట్లు కుప్ప‌లు కుప్ప‌లుగా వ‌చ్చిప‌డ్డాయి. గుజ‌రాత్‌లో సింగ‌ర్ కీర్తిద‌న్ గ‌ద్విని పాడుతున్న పాట‌ల‌కు మురిసిపో‌యిన అక్క‌డి శ్రోత‌లు త‌మ వ‌ద్ద ఉన్న డ‌బ్బుని తీసి ఇలా గాయ‌కుడిపైకి విసిరేశారు. వేదిక‌పైకి వ‌చ్చిప‌డిన‌ ఆ డ‌బ్బు మొత్తం విలువ ల‌క్ష‌ల్లో ఉంటుంది. జాన‌ప‌ద గాయ‌కుడిగా కీర్తిదన్ గుజ‌రాత్‌లో ఎంతో పేరుతెచ్చుకున్న విష‌యం తెలిసిందే. గ‌తంలోనూ ఆయ‌న‌పై ఇలాగే క‌రెన్సీ తుపాను కురిసింది.

  • Loading...

More Telugu News