: భవిష్యత్ లో తల్లిదండ్రులు...'అలా టైం వేస్టు చేసే బదులు, కాసేపు ఆ ఫేస్ బుక్ చూడొచ్చుకదా!' అంటారేమో!


'అలా ఊరికే టైం వేస్టు చేసే బదులు ఆ ఫేస్ బుక్ చూడొచ్చుకదా?' అని తల్లిదండ్రులు అనే రోజు ఎంతో దూరంలో లేదనిపిస్తోంది. రోజుకో ఫీచర్ తో ఆకట్టుకుంటున్న ఫేస్ బుక్ తాజాగా నిరుద్యోగుల కోసం సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ను ప్రపంచంలో ఎవరైనా వినియోగించుకునే అవకాశం ఉంది. ట్రంప్ విధించినటువంటి ఆంక్షలు లాంటివి అడ్డంకి కాకపోతే ప్రపంచంలోని ఏమూలనున్నవారైనా ఏమూలకైనా వెళ్లి ఉద్యోగాలు చేసుకోవచ్చు. ఇంతవరకు లింక్డ్ ఇన్, మాన్ స్టర్ వంటి అంతర్జాల సంస్థలు అభ్యర్థుల రెజ్యూమెలను అందుబాటులో ఉంచుతున్నాయి. వీటికి భిన్నంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉద్యోగాల్లో ఖాళీల వివరాలను వినియోగదారుల ముందుకు తీసుకురావడంతో పాటు వాటికి దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ఫేస్ బుక్ కల్పించనుంది.

ఈ నేపథ్యంలో భవిష్యత్ లో ఫేస్ బుక్ నిరుద్యోగులకు మరింత ఉపయోగకరంగా మారనుంది. ఈ క్రమంలో ' మా వాడు 24 గంటలూ స్మార్ట్ ఫోన్ కు అతుక్కుపోతాడు' అని నిష్ఠూరమాడే కుటుంబ సభ్యులు, 'అలా స్నేహితులతో ఊరికే తిరిగేకంటే ఫేస్ బుక్ చూసుకోవచ్చుకదా?' అనే రోజులు ముందున్నాయని ఫేస్ బుక్ అభిప్రాయపడుతోంది. ఫేస్‌ బుక్‌ లో వచ్చే ఉద్యోగావకాశాలు అన్నీ ఒక లిస్టులా కనిపిస్తాయి. ప్రతిదాని పక్కన 'అప్లై నౌ' అనే బటన్ ఉంటుంది. అది నొక్కితే చాలు.. అప్పటికే ప్రొఫైల్‌ లో ఉన్న సమాచారం ఆటోమేటిగ్గా ఫిలప్ అయి ఉంటుంది. వాటిలో ఏవైనా మార్పులు చేయాలనుకుంటే చేసి, అప్‌ లోడ్ చేస్తే సరిపోతుంది. పెద్ద పెద్ద ఉద్యోగాలతో పాటు పార్ట్ టైం ఉద్యోగాల గురించి కూడా ఇందులో వివరాలు వుంటాయి. 

  • Loading...

More Telugu News