: సంబరాలు చేసుకోవడం కాదు.. నిజాయతీగా ఉండేందుకు ప్రయత్నించండి: పార్టీ కార్యకర్తలకు స్టాలిన్ హితవు
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు సుప్రీంకోర్టు జైలు శిక్ష విధించిన వెంటనే డీఎంకే కార్యాలయం వద్ద పండుగ వాతావరణం నెలకొంది. పార్టీ ప్రధాన కార్యాలయం వద్దే కాకుండా, రాష్ట్ర వ్యాప్తంగా డీఎంకే కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. అయితే, ఈ సంబరాలను డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ తప్పుబట్టారు. సంబరాలు చేసుకోవడం మంచి పద్ధతి కాదని అన్నారు. అలాంటి తప్పులు మనం చేయకుండా, నిజాయతీపరులుగా ఉండేందుకు ప్రయత్నించాలని ఆయన సూచించారు. ఈ మేరకు పార్టీ శ్రేణులకు ఆయన ఒక లేఖ రాశారు.