: జయలలిత, శశికళ బంధంలో షాకింగ్ నిజాలున్నాయ్.. వాటిని నా సినిమాలో చూపిస్తా: రామ్ గోపాల్ వర్మ


ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో బాంబు పేల్చారు. దివంగత జయలలిత, శశికళల మధ్య ఉన్న బంధంలో అనేక షాకింగ్ నిజాలున్నాయని... పోయెస్ గార్డెన్ లో పని చేస్తున్న వారు ఈ నిజాలను తనకు చెప్పారని... తాను తీయబోయే 'శశికళ' సినిమాలో ఈ నిజాలను బయటపెడతానని వర్మ ట్వీట్ చేశాడు.

మెజారిటీ ఎమ్మెల్యేలు పళనిస్వామికి మద్దతు పలకడానికి కారణం, వారంతా శశికళకు చెందిన మన్నార్ గుడి మాఫియా ఎంపిక చేసినవారేనని... ఈ విషయాన్ని కూడా పోయస్ గార్డెన్ లో పని చేస్తున్న ఓ తోటమాలి చెప్పాడని వర్మ తెలిపాడు. కనీసం వ్యతిరేకించే అవకాశాన్ని కూడా ఎమ్మెల్యేలకు శశికళ ఇవ్వడం లేదని చెప్పాడు.

మన్నార్ గుడి మాఫియా సభ్యుడు పళనిస్వామి ముఖ్యమంత్రి అయితే, డాన్ శశికళ జైలు నుంచే తమిళనాడు ప్రభుత్వాన్ని నడిపిస్తుందని వర్మ అన్నాడు. జంతువులను హింసించే జల్లికట్టు పట్ల తమకున్న ప్రేమపై తమిళులు కనీసం ఒక శాతమైనా గర్వించవచ్చని... ఎందుకంటే తమిళ నాయకులు ప్రజలను జంతువులకన్నా హీనంగా చూస్తున్నారని చెప్పాడు.





  • Loading...

More Telugu News