: కేసీఆర్ తో 15 నిమిషాలు మాట్లాడిన నరేంద్ర మోదీ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. దాదాపు 15 నిమిషాల పాటు ఆయనతో ముచ్చటించారు. ఈ సందర్భంగా కేసీఆర్ కు ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సంపూర్ణ ఆరోగ్యంతో నిండు నూరేళ్లు జీవించాలని మనస్పూర్తిగా ఆకాంక్షించారు. ఇదే విషయాన్ని ట్విట్టర్ ద్వారా కూడా మోదీ వెల్లడించారు. మరోవైపు, తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మోదీకి కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు.
Warm birthday wishes to Telangana CM Shri K Chandrashekar Rao Garu. May he be blessed with a long life and good health.
— Narendra Modi (@narendramodi) February 17, 2017