: భారతీయులను భయపెట్టిన ట్రంప్ ఎలా బుట్టలో పడేశాడో తెలుసా?
ముస్లింలపై ట్రావెల్ బ్యాన్, హెచ్1బీ వీసాలపై ఆంక్షలు.. అంటూ భారతీయులను బెంబేలెత్తించిన డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన ఆఫర్ ను వినియోగించుకునేందుకు భారతీయుులు పోటీ పడుతున్నారు. సగటున వారానికి ముగ్గురు చొప్పున భారతీయులు ఈబీ-5 వీసా ప్రోగ్రాంలో చేరిపోతున్నారు.
ఇంతకీ ఈబీ-5 వీసా ప్రోగ్రాం అంటే ఏంటి?
ఈబీ-5 వీసా ప్రోగ్రాం అంటే అమెరికాలో శాశ్వతంగా నివాసం ఉండాలనుకునే విదేశీయులు మిలియన్ డాలర్ల పెట్టుబడితో స్టార్టప్ ఏర్పాటు చేయాలి. దానికి ప్రభుత్వం ఆమోద ముద్రవేస్తే... ఆ స్టార్టప్ లో కనీసం పది మంది రూరల్ అమెరికన్లకు ఉద్యోగాలివ్వాలి. అలా చేస్తే స్టార్టప్ పెట్టిన వారికి అమెరికాలో శాశ్వత నివాసానికి (గ్రీన్ కార్డు) అర్హత లభిస్తుంది. అలా కాని పక్షంలో ప్రభుత్వం అప్రూవ్ చేసిన బిజినెస్ లో 3.7 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టాలి. అలా చేస్తే ప్రభుత్వమే పది మంది అమెరికన్లకు ఉద్యోగాలిస్తుంది. ఈ మొత్తం మళ్లీ వెనక్కి కావాలనుకుంటే ఐదేళ్ల తరువాత తన డబ్బును ఉపసంహరించుకోవచ్చని తెలుస్తోంది.
అయితే అదెలా అన్నదానిపై పూర్తి స్పష్టత లేదు. ఈ ప్రోగ్రాంలో చేరడానికి ఇప్పటి వరకు 210 మంది సంతకాలు పెట్టగా, అందులో 42 భారతీయులే కావడం విశేషం. బెయిన్, రిలయన్స్, ఆదిత్య బిర్లా, మెక్ కిన్సే లాంటి కంపెనీల్లో పెద్ద స్ధాయిలో పనిచేస్తున్న ఉద్యోగులు, వ్యాపార కుటుంబాలు ఈ దరఖాస్తుల్లో సంతకాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, ఈ తంతును చూసి అమెరికాయా? మజాకా? అంటున్నారు. తలపై తుపాకీ గురిపెట్టి పెట్టుబడి పెట్టించడమేనని పలువురు విమర్శిస్తున్నప్పటికీ... దేశానికి మేలు జరుగుతుందంటే ట్రంప్ ఏం చేయడానికైనా సిద్ధమని పలువురు పేర్కొంటున్నారు.