: అలనాటి నటి రేఖ లేఖ చూసి, కన్నీరు పెట్టిన బాలీవుడ్ స్టార్ అమీర్!


అలనాటి అందాల నటి రేఖ రాసిన లేఖను చూసి, బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కంటతడి పెట్టాడు. అమీర్ చిత్రం 'దంగల్'ను చూసిన రేఖ... ఆయన నటనకు ముగ్ధురాలైపోయింది. వెంటనే అమీర్ ను ప్రశంసిస్తూ లేఖ రాసింది. ఆ లేఖను చదివిన అమీర్ కళ్లలో నుంచి నీరు జలజలా రాలింది. ఒక్కసారిగా ఏడ్చేశాడు. ఈ లేఖకు తన హృదయంలో ఎప్పటికీ స్థానం ఉంటుందని అమీర్ చెప్పాడు. 'దంగల్' సినిమా విజయవంతమైన నేపథ్యంలో ఏర్పాటు చేసిన పార్టీకి రేఖ వచ్చింది. ఈ సందర్భంగా తన లేఖను అమీర్ కు ఇచ్చింది. ఆ లేఖను అక్కడే చదివిన అమీర్ చలించిపోయాడు.

ఈ నెల ఐదవ తేదీన ఈ పార్టీ జరిగింది. సాధారణంగా ఎలాంటి పార్టీలకు రాని రేఖ, ఈ ఫంక్షన్ కు మాత్రం వచ్చింది. కాంజీవరం పట్టుచీరలో ఫంక్షన్ కు వచ్చిన రేఖ... అమీర్ కు జీవితాంత గుర్తుండిపోయే అనుభూతిని ఇచ్చింది. 'దంగల్' సినిమా మన దేశంలోనే ఏకంగా రూ. 400 కోట్లకు పైగా కొల్లగొట్టింది.

  • Loading...

More Telugu News