: కొరకొరా చూస్తున్న భార్య ఫోటో పెట్టి... ట్వీట్ తో ఆకట్టుకున్న సెహ్వాగ్


టీమిండియా డాషింగ్ మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మరోసారి ట్విట్టర్‌ ట్వీట్ తో ఆకట్టుకున్నాడు. రెండు రోజుల క్రితం జవాన్లను కీర్తిస్తూ పోస్టు చేసిన సెహ్వాగ్, తనను విమర్శించిన కశ్మీరీ యువకులపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ సారి తన వైపు కోపంగా, కొరకొరా నమిలేసేలా చూస్తున్న భార్య ఫోటో పోస్టు చేసిన సెహ్వాగ్... ఎంత పెద్ద సమస్యకైనా చక్కని నవ్వు, సుఖనిద్ర తిరుగులేని పరిష్కారాలని వ్యాఖ్యానించాడు. ఈ ట్వీట్ కు సెహ్వాగ్ తో అభిమానులు ఏకీభవించారు. దీంతో లైకులు, కామెంట్లు, షేర్లతో ఇది హోరెత్తిపోతోంది.



  • Loading...

More Telugu News