: నేడు యూపీ ఎన్నికల ప్రచారంలో ప్రియాంకా గాంధీ .. బీజేపీకి దీటైన జవాబు?
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోకి ప్రియాంకా గాంధీ కూడా దిగుతున్నారు. నేడు అమేధీలో జరగనున్న బహిరంగ సభలో సోదరుడు రాహుల్ గాంధీతో పాటు ఆమె వేదికను పంచుకోనున్నారు. తద్వారా ఆమె బీజేపీ విమర్శలకు సమాధానం చెప్పనున్నారు. నిన్న స్మృతీ ఇరానీ మాట్లాడుతూ, ప్రియాంక గాంధీ ఇంతవరకు ప్రచారంలో పాల్గొనకపోవడానికి కారణం తనకు తెలుసన్నారు. అమేధీలో ఓటర్లకు ప్రియాంక, రాహుల్ చాలా హామీలిచ్చారని, ఇంతవరకు అవి నేర్చకపోవడంతో మొహం చెల్లక రాలేదని ఎద్దేవా చేశారు. ఆమె విమర్శలకు సమాధానంగా అమేధీలో బహిరంగ సభకు ప్రియాంకా గాంధీ రానుండడం విశేషం.