: ఐపీఎల్ లో గుజరాత్ లయన్స్ కు సహాయకోచ్ గా కైఫ్!


2014 సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లోని పాలంపూర్ నియోజకవర్గం నుంచి లోక్ సభకు పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ టీమిండియా ఆల్ రౌండర్ మహ్మద్ కైఫ్ ఐపీఎల్ లో గుజరాత్ లయన్స్ జట్టుకు సహాయకోచ్ గా నియమితుడయ్యాడు. టీమిండియాలో అద్భుతమైన ఫీల్డర్ గా భారతీయుల మనసులు గెలుచుకున్న కైఫ్ ఫిట్ నెస్ లో తిరుగులేని ఆటగాడిగా పేరుతెచ్చుకున్నాడు.

ఇప్పుడు ఫిట్ నెస్ పై ఆటగాళ్లంతా శ్రద్ధ పెడుతున్న దశలో కైఫ్ ఆల్ రౌండ్ నైపుణ్యం జట్టుకు అక్కరకొస్తుందని భావించిన గుజరాత్ లయన్స్ జట్టు అతనిని సహాయకోచ్ గా నియమించింది. కాగా, ఆ జట్టుకు కోచ్ గా ఆస్ట్రేలియా స్పిన్నర్ బ్రాడ్ హాగ్ వ్యవహరిస్తున్నాడు. దీనిపై కైఫ్ తో పాటు ఆ జట్టు కెప్టెన్ సురేష్ రైనా హర్షం వ్యక్తం చేశారు. ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ జట్టు కోచ్ పదవిని ఆశించిన కైఫ్ అక్కడ లాల్ చంద్ రాజ్ పుత్ నుంచి పోటీ ఎదురుకావడంతో వెనుదిరిగాడు. 

  • Loading...

More Telugu News