: రిసార్ట్ నుంచి బెంగళూరుకు బయల్దేరనున్న తమిళనాడు సీఎం పళని స్వామి


తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన పళనిస్వామి నేడు బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలుకు వెళ్లనున్నారు. జైలులో చిన్నమ్మ ఆశీస్సులు తీసుకుంటారు. తరువాత రేపటి బలపరీక్షపై చిన్నమ్మతో చర్చలు జరిపే అవకాశం కనిపిస్తోంది. అనంతరం తిరిగి చెన్నై చేరుకుని రేపటి బలపరీక్షకు ఏర్పాట్లు చేయనున్నారు. ఇప్పటికే తన వర్గం ఎమ్మెల్యేలు చేజారకుండా ప్రమాణ స్వీకారం అనంతరం రిసార్ట్ కు చేర్చిన సీఎం పళనిస్వామి రేపటి బలపరీక్షతో రిలాక్స్ కావాలని భావిస్తున్నారు. మరోపక్క, శశికళను పరామర్శించేందుకు జైలు వద్ద సందడి పెరుగుతోంది. తమిళనాడు వాసులు జైలుకు పోటెత్తుతున్నారు. అయితే, వారికి జైలు అధికారులు ఎలాంటి అనుమతులు మంజూరు చేయడం లేదని సమాచారం.

  • Loading...

More Telugu News