: వచ్చీ రావడంతోనే.. పన్నీర్ కు ఫస్ట్ షాకిచ్చిన పళనిస్వామి!


తమిళనాడు నూతన ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రమాణం చేసిన మరుక్షణం నుంచే మాజీ ముఖ్యమంత్రి, ప్రత్యర్థి పన్నీర్ సెల్వంకు షాకిచ్చారు. పార్టీపై తిరుగుబావుటా ఎగురవేసిన పన్నీర్ సెల్వంకు ఉన్న ప్రత్యేక సౌకర్యాలను తొలగించారు. ఆయన ప్రత్యేకవాహన సౌకర్యాన్ని రద్దు చేశారు. భద్రతను ఉపసంహరించారు. ఇకపై ఆయనకు ప్రభుత్వ సౌకర్యాలేవీ అందవని స్పష్టం చేశారు. దీంతో ఆయన తన సొంత వాహనంలోనే జయలలిత సమాధివద్దకు చేరుకుని నివాళులర్పించారు. ఈ సందర్భంగా పళనిస్వామి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన పన్నీర్ సెల్వం ప్రభుత్వ పతనమే తన లక్ష్యమని సమాధి సాక్షిగా ప్రకటించారు. దీంతో ముందు ముందు ఏం జరగనుందోనని తమిళనాట ఆసక్తి రేగుతోంది. 

  • Loading...

More Telugu News