: ప్రపంచంలోనే అత్యంత బరువైన మహిళ కోరిన కోరిక ఏంటో తెలుసా?
ప్రపంచంలోనే అత్యంత బరువైన ఈజిప్టు మహిళ యెమన్ అహ్మద్ (36) బేరియాట్రిక్ సర్జరీ కోసం ఈ నెల 11న ముంబై చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ముంబైలోని సైఫీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె మాట్లాడుతూ, తనకు బాలీవుడ్ లో ముగ్గురు ఖాన్ లు ఇష్టమని చెప్పింది. ముగ్గుర్లోకి కండల వీరుడు సల్మాన్ ఖాన్ అంటే మరీ ఇష్టమని, అతనిని కలవాలని ఉందని కూడా చెప్పింది. అంతేకాకుండా తనకు సర్జిరీ చేస్తున్న డాక్టర్ ముఫ్జల్ లక్డావాలాతో సల్మాన్ మాట్లాడాలని ఆకాంక్ష వ్యక్తం చేసింది.