: సల్మాన్ ఖాన్ చీప్ ఆర్టిస్ట్.. అతనికి స్టయిలే తెలియదు!: పాకిస్థాన్ నటి
ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ను పలువురు హీరోయిన్లు గాడ్ ఫాదర్ అంటుంటారు. హీరోయిన్స్ కు లైఫ్ ఇస్తాడని, ఒకసారి అతనితో మంచి అనుబంధం ఏర్పడితే ఏదోరకంగా ఆదుకుంటాడని చెబుతుంటారు. అలాంటి సల్లూ భాయ్ పై బాలీవుడ్ లో అరంగేట్రానికి ప్రయత్నిస్తున్న పాకిస్థాన్ నటి సబా కమర్ సంచలన ఆరోపణలు చేసింది. సల్మాన్ తో అవకాశం వచ్చినా నటించనని తెలిపింది. సల్మాన్ చీప్ నటుడని తెలిపింది. సల్మాన్ ఖాన్ కి అసలు స్టయిలే తెలియదని ఎద్దేవా చేసింది.
అలాగే బాలీవుడ్ సీరియల్ కిస్సర్ గా పేరొందిన ఇమ్రాన్ హష్మీని కూడా పనిలో పనిగా తిట్టేసింది. అతనితో కూడా కలిసి నటించనని చెప్పింది. అతడిని ముద్దు పెట్టుకుంటే మౌత్ (నోటి) కేన్సర్ వస్తుందని పేర్కొంది. బాలీవుడ్ సినిమాల్లో పాక్ నటులను తీసుకోకూడదంటూ మహారాష్ట్రలో చర్చ నడుస్తున్న వేళ... సబా కమర్ చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ సినీ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి.