: పన్నీర్ సెల్వం ఇంటిపై రాళ్ల దాడి!
తమిళనాడు సీఎంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాననే ధీమాతో ఇన్నాళ్లూ ఉన్న పన్నీర్ సెల్వంకు చుక్కెదురైన సంగతి తెలిసిందే. అసలే, ఈ నిరాశలో ఉన్న ఆయనకు మరో చేదు అనుభవం ఎదురైంది. కొంచెం సేపటి క్రితం, పన్నీర్ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడికి దిగారు. ఈ నేపథ్యంలో ఆయన ఇంటి వద్ద పోలీస్ బలగాలు మోహరించాయి. ఈ దాడికి ఎవరు పాల్పడి ఉంటారనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.