: మీరు హెడ్‌లైన్ కోసం ప్రయత్నిస్తున్నారు.. ఆ అవకాశం ఇవ్వను: రజనీ ఎంట్రీపై అమిత్ షా
తమిళనాడు అధికార అన్నా డీఎంకే పార్టీలో తలెత్తిన సంక్షోభం నేపథ్యంలో సినీనటుడు రజనీ కాంత్ రాజకీయ అరంగ్రేటం అంశం మరోసారి పెద్ద ఎత్తున చర్చకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆయనతో బీజేపీ మంతనాలు జరుపుతోందని కూడా ప్రచారం జరిగింది. మరోవైపు పన్నీర్ సెల్వం వెనుక కూడా బీజేపీ ఉందని పలువురు ఆరోపణలు గుప్పించారు. ఈ అంశాలపై స్పందించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, పన్నీర్ సెల్వం వెనుక బీజేపీ ఉందన్న ఆరోపణలను తోసిపుచ్చారు. తమిళనాడులోని అన్నాడీఎంకే పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలకి, తమకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు.
అది అన్నాడీఎంకే అంతర్గత వ్యవహారమని అమిత్ షా చెప్పారు. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్‌ను బీజేపీ బరిలోకి దింపే అవకాశముందా? అని మీడియా ప్రశ్నించగా స్పందించిన అమిత్ షా.. మీడియా వారు హెడ్‌లైన్ కోసం ప్రయత్నిస్తున్నారని, ఆ అవకాశం తాను ఇవ్వబోనని, ఏం జరగనుందో వేచిచూడాలని చెప్పారు.