: జగన్ కు జైలు శిక్ష తప్పదు: సీఎం చంద్రబాబు


ఆదాయానికి మంచిన ఆస్తులు క‌లిగి ఉన్న కేసులో త‌మిళ‌నాడులో శ‌శిక‌ళ న‌ట‌రాజ‌న్ జైలుకి వెళ్లిన నేప‌థ్యంలో టీడీపీ నేత‌లంతా ఆమెతో వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డిని పోల్చుతున్నారు. తాజాగా టీడీపీ అధినేత, ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు జ‌గ‌న్‌ను శ‌శిక‌ళ‌తో పోల్చుతూ అక్రమాస్తుల కేసులో ఆమె 20 ఏళ్ల తర్వాత జైలుకు వెళ్లిందని, ఇక్క‌డ జ‌గ‌న్ కూడా రూ.40 వేల కోట్ల అక్రమాలకు పాల్పడ్డాడ‌ని, ఆయ‌న కూడా జైలుకు వెళ్లాల్సిందేనని వ్యాఖ్యానించారు.

ఈ రోజు చిత్తూరు జిల్లాలోని కుప్పంలో ఆయ‌న మాట్లాడుతూ... టీడీపీ కార్యకర్తలు ఎంతో కృషి చేస్తున్నార‌ని వారి రుణం ఎప్పటికీ తీర్చుకోలేమ‌ని అన్నారు. పార్టీ కార్య‌క‌ర్త‌ల సంక్షేమమే తనకు ముఖ్యమని చెప్పారు. త‌మ ప్ర‌భుత్వం పూర్తి చేసిన‌ పట్టిసీమ ప్రాజెక్టుతో రాయలసీమ సస్యశ్యామలమవుతోందని ఆయ‌న వ్యాఖ్యానించారు. శ్రీశైలం మిగులు జలాలను రాయలసీమకు అందిస్తున్నామ‌ని చంద్ర‌బాబు నాయుడు చెప్పారు.

  • Loading...

More Telugu News