: టీడీపీ నేత ఇంట్లో పెళ్లికి కోట్ల రూపాయల ఖర్చు!


గుంటూరు జిల్లా టీడీపీ నేతలు తమ పిల్లల వివాహానికి కోట్ల రూపాయలు ఖర్చు చేశారట. వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు కుమార్తె లక్ష్మిసౌజన్యకు పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ కుమారుడు సాయి సుధాకర్ తో నిన్న వివాహం జరిగింది. ఈ- మేడికొండూరు మండలంలోని కైలాసగిరి వద్ద ఎమ్మెల్యే శ్రీధర్ కు చెందిన ముప్ఫై ఎకరాల 'అభినందన వెంచర్'లో ఈ వివాహ వేడుక జరిగింది. నాడు జూనియర్ ఎన్టీఆర్ పెళ్లికి సెట్టింగ్ లు వేసిన బెంగళూరుకు చెందిన సంస్థే.. వీరి పెళ్లికీ సెట్టింగ్ వేసింది. ఒకటిన్నర ఎకరం విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన కల్యాణ మంటపానికి రూ.2.50 కోట్లు, భోజనాల కోసం రూ.2 కోట్లు, పెళ్లికి వచ్చే వారిని ఆర్టీసీ బస్సుల ద్వారా తరలించేందుకు రూ.42 లక్షల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. 

  • Loading...

More Telugu News