: పన్నీర్ సెల్వం వచ్చి శశికళ కాళ్లు పట్టుకోవడం నేను చూశాను: ఏఐఏడీఎంకే అధికార ప్రతినిధి అప్సరా రెడ్డి
పురచ్చితలైవి జయలలిత మరణానంతరం శశికళ ముఖ్యమంత్రి కావాలని అనుకుంటే అప్పుడే అయ్యేవారని ఏఐఏడీఎంకే అధికార ప్రతినిధి అప్సరారెడ్డి తెలిపారు. చెన్నైలో ఆమె మాట్లాడుతూ, శశికళకు పదవీకాంక్ష లేదని అన్నారు. జయలలిత మరణానంతరం వేదనిలయంకు వచ్చిన ఓపీఎస్ శశికళ మేడమ్ కాళ్లు పట్టుకున్నారని చెప్పారు. పార్టీ అధ్యక్షురాలి పదవి, ముఖ్యమంత్రి పదవి చేపట్టి పార్టీని కాపాడాలని కోరారని చెప్పారు. ఆ సమయంలో తాను అక్కడే ఉన్నానని ఆమె వెల్లడించారు. ఆ తరువాత ఏమైందో తెలియదని, డీఎంకే మాటలు విని ఆయన ఎదురు తిరిగారని ఆమె చెప్పారు. పార్టీపై తిరుగుబాటు చేసిన ద్రోహులు శిక్ష అనుభవించాల్సిందేనని ఆమె అభిప్రాయపడ్డారు. అలాంటి వారి వల్ల పార్టీకి వచ్చిన నష్టం ఎమీ లేదని ఆమె పేర్కొన్నారు.