: శశికళ శిబిరంలో మంత్రి గారు సైకిల్ తొక్కుతుంటే.. ఫొటోలు తీసుకున్నారట!


శశికళ తనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలను గోల్డెన్ బే రిసార్ట్ లో ఉంచిన విషయం తెలిసిందే. ఆ ఎమ్మెల్యేలతో పాటు కొంతమంది మంత్రులు కూడా అందులో ఉన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు తమకు నచ్చిన తీరులో ఎంజాయ్ చేస్తూ, ఎవరి సరదాల్లో వారు మునిగిపోయారు. అయితే, ఆ మంత్రుల్లో ఒకరైన ఉడుమలై రాధాకృష్ణ న్ తనదైన శైలిలో మోకాళ్ల వరకు ఉన్న ఒక నిక్కర్ ధరించి, చెవిలో సెల్ ఫోన్ తో, సైకిల్ ఎక్కి రిసార్ట్ లో చక్కర్లు కొడుతుంటే.. పార్టీ కార్యకర్తలు, ఆయన సహాయకులు తేరిపారా చూస్తూ నిలబడేవారట. మళ్లీ, ఇటువంటి సన్నివేశం తాము చూస్తామో? లేదో? అని వారు అనుకున్నట్టున్నారు.. అందుకే, తమ సెల్ ఫోన్లలో ఈ దృశ్యాలను బంధించారు. ఆ ఫొటోలను తమ సన్నిహితులకు, మిత్రులకు పంపడంతో, అవి కాస్తా సామాజిక మాధ్యమాలకు చేరి వైరల్ గా మారాయి.

  • Loading...

More Telugu News