: ఎట్టకేలకు రిసార్టు నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యేలు.. రాజ్‌భవన్‌కు పయనం!
తమిళనాడు అధికార అన్నాడీఎంకే పార్టీలో ఏర్పడిన సంక్షోభ పరిస్థితుల్లో తమ ఎమ్మెల్యేలు పన్నీర్ సెల్వం వైపుకి జారిపోకుండా వారిని శశికళ నటరాజన్ గోల్డెన్ బే రిసార్టులో ఉంచిన విషయం తెలిసిందే. తొమ్మిది రోజుల నుంచి రిసార్టులోనే గడుపుతున్న వారు ఈ రోజు గవర్నర్ తమ నిర్ణయాన్ని ప్రకటించడంతో ఎట్టకేలకు బయటకువచ్చారు. రాజ్‌భవన్‌లో పళనిస్వామి కాసేపట్లో తమిళనాడు 12వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గోల్డెన్ బే రిసార్టు నుంచి ప్రమాణ స్వీకరణ వేదిక వద్దకు సదరు ఎమ్మెల్యేలు బయలుదేరారు. గోల్డ్ బే రిసార్టు వేదికగా తొమ్మిది రోజుల పాటు హైడ్రామా నడిచిన విషయం తెలిసిందే. రాజ్ భవన్ ప్రాంతంలో పోలీసుల బలగాలను పెంచారు.