: పన్నీర్ కార్యకర్తల ఆత్మహత్యాయత్నం..పరిస్థితి విషమం!
తమిళనాడు సీఎంగా పన్నీర్ సెల్వంకు అవకాశం లభించకపోవడంతో మనస్తాపం చెందిన ఇద్దరు కార్యకర్తలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కొలత్తూరు, సేనిమావట్టమ్ లో ఇద్దరు కార్యకర్తలు కిరోసిన్ పోసుకుని తమను కాల్చుకునేందుకు యత్నించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా, ఈ సమాచారం తెలుసుకున్న పన్నీర్ సెల్వం, ఆ కార్యకర్తలను పరామర్శించేందుకు బయలుదేరి వెళ్లనున్నారు.