: పార్టీని శశికళ కుటుంబం చేతుల్లోకి వెళ్లనివ్వం!: పన్నీర్ సెల్వం
తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని అన్నాడీఎంకే శాసనసభ పక్షనేత పళనిస్వామిని ఆ రాష్ట్ర ఇన్ఛార్జీ గవర్నర్ విద్యాసాగర్ రావు ఆహ్వానించిన అంశంపై పన్నీర్ సెల్వం స్పందించారు. ఓ జాతీయ మీడియాతో ఆయన మాట్లాడుతూ... తాము తమ అన్నాడీఎంకే పార్టీని శశికళ నటరాజన్ కుటుంబం చేతుల్లోకి వెళ్లనివ్వబోమని చెప్పారు. మొదట తాము ఈ అంశంపై ఈసీకి ఫిర్యాదు చేయనున్నామని చెప్పారు. పార్టీ నేతలు ఐక్యంగా ముందుకు వెళ్లేట్లు ప్రయత్నాలు జరుపుతామని చెప్పారు. శశికళకు వ్యతిరేకంగా తన పోరాటం కొనసాగుతోందని చెప్పారు. రాజకీయాల్లో జోక్యం చేసుకోనని జయలలితకు చెప్పిన శశికళ ఇప్పుడు సీఎం కావాలని కలలు కన్నారని పన్నీర్ సెల్వం చెప్పారు. తాము అమ్మ జయలలిత ఆశయాలను ముందుకు తీసుకెళతామని చెప్పారు.